మహేష్‌బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అనగానే అభిమానుల్లోనూ ప్రేక్షకుల్లోనూ ఎంతో క్రేజ్ వచ్చింది. దీనికి థమన్ సంగీతం సమకూర్చడం ప్లస్‌గా మారింది. ఇక షూటింగ్ జరుగుతుండగా ఇటీవలే సినిమా టైటిల్ ప్రకటించారు. గుంటూరు కారం అని పెట్టారు. ఆ టైటిల్ అభిమానుల్లో చాలామందికి నచ్చలేదు. ఇక ఆ తర్వాత అసలు ఈ సినిమా వుంటుందా లేదా? అనే అనుమానం చాలా చోట్ల వినిపించింది. తాజాగా ఈ సినిమా నుంచి పూజాహెగ్డే, శ్రీలీల కూడా తప్పుకుంటున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.