రేవంత్ రెడ్డి ని కలిసేది పెద్ద నిర్మాతలేనా? వేడుకలకు బ్రేక్ పడనుందా?

డీవీ

గురువారం, 26 డిశెంబరు 2024 (10:13 IST)
Revanth, Raju
ఈరోజు  రేవంత్ రెడ్డిని తెలుగు చలన చిత్రరంగ ప్రముఖులు కలవనున్నారు. 10 గంటలకు ఆయన్ను కలవనున్నట్లు దిల్ రాజు నిన్న ప్రకటించారు. కానీ ఎవరెవరు వస్తున్నారనేది వెల్లడించలేదు. దాదాపు 45 నిముషాల వ్యవధి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. చర్చల్లో ప్రధానంగా టికెట్ల రేట్లు, బెనిఫిట్ షోల గురించి ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ప్రధానంగా సినిమా వేడులకు సంబంధించిన విషయం కూడా చర్చించనున్నట్లు సమాచారం. సినిమారంగ సమస్యలపై కూలంకషంగా చర్చించే సమయం కూడా సి.ఎం.కు లేదని తెలుస్తోంది. సినిమాటోగ్రఫీ ముఖ్యమంత్రికి ఆ బాధ్యత అప్పగించే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. 
 
ఈరోజు సి.ఎం. బిజీ షెడ్యూల్ ను సి.ఎం.పేషీ విడుదల చేసింది. 11 గంటలకు బేగం పేట నుంచి హెలికాప్టర్ లో బెలగామ్ బయలు దేరి వెళనున్నారు. అక్కడ మధ్యాహ్నం 2 గంటలకు సి.డబ్ల్యు.సి. సమావేశంలో పాల్గొననున్నారు. కనుక ఎక్కువ సమయం సినిమారంగ ప్రముఖులకు ఇచ్చినా సరైన క్లారిటీ వుండదనీ, మరో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించవచ్చని ఫిలిం ఛాంబర్ ప్రతినిధిలు తెలియజేస్తున్నారు.

ముఖ్యంగా చిన్న నిర్మాతలు ఎక్కువగా వుండడం, తెలంగాణ నిర్మాతల సంఘం కూడా వుండడం అందరికీ న్యాయం జరిగేలా సమావేశం జరుగుతుందా? లేదా? అనేది కూడా క్లారిటీ లేదు. ప్రతీసారీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు మాత్రమే సి.ఎం.ను కలవడం పట్ల చిన్న నిర్మాతల తరపున నట్టికుమార్, తెలంగాణ తరఫున ఆర్.కె.గౌడ్ గతంలో పలు సార్లు ఆక్షేపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓపెన్ ప్లేస్‌లో ఈవెంట్స్, క్రౌడ్ గ్యాదరింగ్స్ చేయొద్దని నిర్మాతలకు  హీరోలు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు