దర్శక ధీరుడు రాజమౌళి సృష్టించిన సెల్యులాయిడ్ వండర్ ''బాహుబలి ది బిగినింగ్'' ప్రపంచవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. ఇప్పటికే దేశంలోనే అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా సరికొత్త రికార్డులు సృష్టించిన చిత్రం 'బాహుబలి'. అన్ని భాషలల్లోను విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా టాప్ టీఆర్పీ రేటింగ్ సాధించి రికార్డు క్రియేట్ చేసిన చిత్రాల్లో 'బాహుబలి' ఓవర్ ఆల్‌గా ఆరవ స్థానాన్నిదక్కించుకుంది.