'కబాలి' థియేటర్ టిక్కెట్ దొరకలేదా? ఆ హోటల్స్‌లో చూడొచ్చు.. ఎలా? టిక్కెట్ ధర రూ.1300!

సోమవారం, 18 జులై 2016 (14:14 IST)
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం కబాలి. ఈ చిత్రం ఈనెల 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం విడుదలకు ముందే అనేక రికార్డులను సృష్టిస్తోంది. 
 
తాజాగా, భారతదేశ సినీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సినిమాని స్టార్ హోటల్స్‌లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సినిమా హక్కుదారులు రజినీకాంత్‌కి జనాల్లో ఉన్న ఫాలోయింగ్‌ని క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా సినిమాని బెంగుళురులోని స్టార్ హోటల్స్‌లో రిలీజ్ చేయనున్నారు. అయితే, ఈ స్టార్ హోటల్‌లో చిత్రం చూడాలంటే మాత్రం టిక్కెట్ ధర రూ.1300 చెల్లించాల్సిందే. 
  
బెంగుళురులోని జెడబ్ల్యూ మారియట్ (విటల్ మాల్యా రోడ్), లలిత్ అశోక్, రాయల్ ఆర్చిడ్(యాలహంక), క్రొన్ ప్లాజా(ఎలక్ట్రానిక్ సిటీ) హోటళ్లలో మూడు రోజులపాటు నాలుగు షోల చొప్పున 300 మంది చూసేందుకు వీలుగా, ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తామని లహరి మ్యూజిక్ డైరెక్టర్ జి.ఆనంద్ అన్నారు. ఇదే జరిగితే భారతీయ సినిమాలో కొత్త శకం మొదలైనట్లేనని విశ్లేషకులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి