బాలీవుడ్ అందాల సుందరి కత్రినా కైఫ్ షూటింగ్‌ల్లో బిజీ బిజీగా ఉంది. దీనికి తోడు పంటి నొప్పి సమస్యతో బాధపడుతున్న కత్రినాకు మొహం వాచిపోయిందట. గత కొన్ని రోజులుగా తాను షూటింగులతో బిజీగా ఉండడంతో డెంటిస్ట్‌ను సంప్రదించలేకపోయిందట. యాంటీ బయోటిక్స్ వాడి కొంత ఉపశమనం పొందుతున్నప్పటికీ ఆమె ముఖం మాత్రం వాచిపోయిందట.
వైద్యుడిని సంప్రదించడం ద్వారా సర్జరీ చేసుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంది. ఇటీవల బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి వెళ్లిన కత్రినాను పరీక్షించిన వైద్యులు ఇప్పుడే సర్జరీ చేయాలని చెప్పారట. ఎందుకంటే, ఇన్ ఫెక్షన్ ఉందని, అది పూర్తిగా తగ్గే వరకు సర్జరీ చేసే ప్రసక్తే లేదన్నారట. కత్రినా కైఫ్ గత వారం నుంచి పంటి నొప్పితో ఇబ్బంది పడుతోంది.