కమల్ హాసన్ దెబ్బకు తట్టుకోలేక సినిమా నుంచి తప్పుకున్న హీరోయిన్..

మంగళవారం, 27 ఆగస్టు 2019 (21:52 IST)
అసలే సీనియర్ మోస్ట్ నటుడు. అందులోను వందల సినిమాలు తీసిన అనుభవం. ఏ క్యారెక్టర్ లోనైనా ఈజీగా లీనమైపోయే వ్యక్తి. ఇదంతా ఎవరో కాదు విశ్వనటుడు కమల్ హాసన్. భారతీయుడు-2 సినిమా ఇప్పుడు వేగంగా షూటింగ్ జరుగుతోంది. ఆ సినిమా  కోసం అభిమానులు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు.
 
అయితే ఆ సినిమాలో యువనటి ఐశ్వర్య రాజేష్ కు అవకాశం వచ్చింది. వరుస విజయాలతో కోలీవుడ్ లో ఐశ్వర్య రాజేష్ దూసుకుపోతోంది. వఅయితే ఈ భారీ చిత్రంలో నటించేందుకు మొదట్లో ఒప్పుకుంది. సినిమా షూటింగ్ ప్రారంభ సమయానికి మాత్రం రాకుండా ఆగిపోయింది. కారణం కమల్ హాసన్ లాంటి పెద్ద నటులతో నటించడం కష్టమన్నది ఒక కారణమైతే.. మరో కారణం క్షణం తీరిక లేకుండా గడపడమేనట. 
 
అయితే సినిమా నుంచి తప్పుకుంటున్నానని చెప్పిన ఐశ్వర్య ఎందుకన్న విషయాన్ని మాత్రం స్పష్టం చేయడం లేదట. ఎందుకంటే కమల్ హాసన్ అభిమానులు ఎక్కడ దాడి చేస్తారేమోనన్న భయంతో సైలెంట్‌గా ఉందట. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు