గదిలోకి పిలిచి టాప్ తీసెయ్.. నేను చూడాలి అన్నాడు.. మల్హార్ రాథోడ్

గురువారం, 23 ఏప్రియల్ 2020 (14:02 IST)
బాలీవుడ్‌తో పాటు.. వివిధ ప్రాంతీయ భాషల్ సినీ ఇండస్ట్రీల్లో తెర వెనుక ఎన్నో బాగోతాలు జరుగుతున్నట్టు పలువురు నటీమణులు ఆరోపించారు. ముఖ్యంగా, పలువురు హీరోయిన్లు మీటూ ఉద్యమం పేరుతో అనేక విషయాలు బహిర్గతం చేశారు. 
 
తాజాగా యువనటి మల్హార్ రాథోడ్ తనకు ఎదురైన అనుభవాలను వెల్లడించింది. ఎనిమిదేళ్ళ క్రితం తనకు జరిగిన ఓ సంఘటనను ఆమె తాజాగా వెల్లడించింది. "ఓ నిర్మాత అవకాశం ఇస్తానని చెప్పి ఆడిషన్స్‌కు నన్ను తన రూమ్‌కి పిలిచాడు. అక్కడకు వెళ్లిన తర్వాత టాప్ తీసేయ్... నేను చూడాలి అని బలవంతం చేశాడు. చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతని వయసు 65 సంవత్సరాలు ఉంటుంది. అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. మెల్లగా అక్కడి నుంచి జారుకున్నా" అని చెప్పుకొచ్చింది. 
 
ఈ ఘటన జరిగిన తర్వాత తాను ఎంతో మనోవేదనకు గురయ్యానని మల్హార్ తెలిపింది. ఇలాంటి కామాంధులు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారని, అలాంటి వారు పైకి మాత్రం చాలా బుద్ధిమంతుల్లా వ్యవహరిస్తున్నారని తెలిపింది. కుటుంబ పోషణకు తన సంపాదనే కీలకం అయినప్పటికీ... అవకాశాల కోసం అలాంటి పనులకు ఒప్పుకునే టైపు తాను కాదని తెగేసి చెప్పింది. ఏరోజు ఇలాంటి పనులు చేయలేదని చెప్పింది. అవసరమైతే వేరే కెరీర్ ఎంచుకుంటానని మర్హార్ రాథోడ్ తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు