చెర్రీ చాలా సెక్సీగా ముద్దొస్తున్నాడు.. ఆల్ ది బెస్ట్ టు 'ధృవ' : మంచు విష్ణు

బుధవారం, 7 డిశెంబరు 2016 (12:31 IST)
మెగాపవర్‌ స్టార్‌ రాంచరణ్‌ సెక్సీ లుక్‌పై హీరో మంచు విష్ణు స్పందించాడు. చెర్రీ చాలా సెక్సీగా ముద్దొస్తున్నాటండూ కామెంట్స్ చేశాడు. రాంచరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ధృవ'. ఈ చిత్రం ఈనెల 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 
 
దీనిపై మంచు విష్ణు స్పందిస్తూ చెర్రీ 'ధృవ' సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఇంతకు ముందు సినిమాలతో పోల్చుకుంటే పూర్తి మేకోవర్‌ సాధించాడు. సల్మాన్‌, అమీర్‌లకు శిక్షణనిచ్చిన ట్రైనర్‌ సహాయంతో ఎంతో కష్టపడి చాలా తక్కువ కాలంలోనే సిక్స్‌ప్యాక్‌ బాడీ సాధించాడు. 
 
ఈ లుక్‌ సెన్సేషన్‌ అయింది. సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు సైతం చరణ్‌ను చూసి ఆశ్చర్యపోయారు. 'ఇది సెక్సీ లుక్‌ కాకపోతే మరేంటి? చరణ్‌ ఎంత కష్టపడ్డాడో అర్థమవుతోంది. ఎంతో డెడికేషన్‌ ఉంటేనే ఇది సాధ్యం. హ్యాట్సాఫ్‌ టు చరణ్‌, ఆల్‌ ది బెస్ట్‌ టు ధృవ' అని విష్ణు ట్వీట్‌ చేశాడు.
 
కాగా, ఇటీవల 'ధృవ' ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌లో కేటీయార్‌, రానాలు సైతం చరణ్‌ ఫిజక్‌ను ప్రశంసించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో మంచు హీరో విష్ణు చేరాడు.

వెబ్దునియా పై చదవండి