తాజాగా మా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఇటీవలే మా కార్యాలయం సమీపంలోనే జరిగింది. సభ్యులు బాగానే హాజరయ్యారు. అయితే అందులో ముఖ్యంగా బిల్డింగ్ గురించి చర్చ వచ్చింది. చాలామంది సభ్యులు మంచు విష్ణు హామీ ఇచ్చినట్లు స్వంతంగా కడితే మరోసారి ఎన్నికలకోసం స్వలాభంకోసం చేస్తున్నారనే ప్రశ్న ఎదురైంది. దాంతో అటు మంచు విష్ణు ఇచ్చిన హామీని నెరవేర్చకపోయినా అపనిందపడకుంటా చూసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న ఫిలింఛాంబర్‌లోని మా కార్యాలయాన్ని అలాగే కొనసాగించడమా, లేక మరోచోట అద్దెకు తీసుకోవడమా! అనే విషయంలో క్లారిటీ రాలేదు.
దీనికి తోడు ఫిలింఛాంబర్ అధ్యక్ష ఎన్నికలు అదేరోజు జరగడం దానికి దిల్‌రాజు అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో అదే కాంపౌండ్‌లో వున్న మా కార్యాలయాన్ని ఏమి చేస్తారనే ప్రశ్న కూడా తలెత్తింది. దీనిపై దిల్‌రాజుతోపాటు ఛాంబర్లోని 4సెక్టార్ల కమిటీతో మంచు విష్ణు త్వరలో సమావేశం కానున్నట్లు సమాచారం. ఇదిలా వుండగా, బిల్డింగ్ విషయంలో తాము ఇచ్చినమాటకు కట్టుబడి వున్నామనీ, ఏమిచేయాలో సభ్యులు తెలియజేయాలని ప్రస్తుతం లండడ్లో వున్న మంచు మోహన్‌బాబు సభ్యులకు సూచించినట్లు తెలిసింది. ఈ ఏడాది చివరలోనే మా ఎన్నికలు జరగాల్సి వున్నాయి. ఈసారి ఎలాంటి హడావుడి జరుగుతుందో చూడాలి.