మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత చిరంజీవి మలయాళంలో విజయం సాధించిన లూసీఫర్ మూవీ తెలుగు రీమేక్‌లో నటించనున్నట్టు తెలియచేసారు. ఈ మూవీ గురించి గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్టు చిరంజీవి ఎనౌన్స్ చేసారు. పవన్ కళ్యాణ్ తో సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాని తెరకెక్కించిన బాబీ ఎన్టీఆర్‌తో జైలవకుశ, వెంకటేష్, నాగచైతన్యలతో వెంకీమామని తెరకెక్కించారు.