చిరంజీవికి చెల్లెలుగా నయనతార?

మంగళవారం, 23 నవంబరు 2021 (12:35 IST)
లేడి అమితాబ్‌గా పేరు తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం బడా సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు లవర్ విగ్నేష్‌తో పెళ్లి పీఠలు ఎక్కడానికి కూడా రెడీ అవుతుంది. అయినా కానీ ఆమెకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. తాజాగా మెగాస్టార్‌తో నటించే ఛాన్స్ వచ్చింది. 
 
ఇదివరకే చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత హిట్ అందుకోలేకపోయింది. ఇక చిరంజీవి రీమేక్ చేస్తున్న లూసీఫర్ సినిమా తెలుగు రీమేక్‌లో గాడ్ ఫాదర్‌గా తెరకెక్కుతుంది. 
 
ఈ సినిమాలో నయనతార చిరంజీవికి చెల్లెలుగా నటించబోతుంది. ఒరిజినల్ వెర్షన్‌లో మంజువారియర్ పోషించిన పాత్రలో నయనతార కనిపించనుంది. అయితే మంజువారియర్ భర్తగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించాడు. ఇక వివేక్ ఒబెరాయ్ పాత్రలో తెలుగులో సత్యదేవ్‌ను సెలక్ట్ చేసిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు