స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మళ్లీ తండ్రి కాబోతున్నాడా? అంటే అవుననే అంతా అంటున్నారు. ఐదేళ్లక్రితం అల్లు అర్జున్, స్నేహ రెడ్డిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరికి 2014లో ఓ కొడుకు జన్మించాడు. ఆ బాబుకి అయాన్ అనే పేరు కూడా పెట్టారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో బన్నీతో పాటు భార్య స్నేహారెడ్డి కూడా హాజరైంది.
ఆ కార్యక్రమంలో స్నేహారెడ్డి బేబీ బంప్‌తో కనిపించడంతో ఆమె మళ్లీ గర్భం దాల్చిందనే వార్తలు జోరుగా వినిపించాయి. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ.... బన్నీ స్నేహారెడ్డి మరో బిడ్డకు స్వాగతం పలుకుతున్నారని మరికొన్ని నెలల్లో శుభవార్త చెప్పబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు నిజమైతే అయాన్‌కు మరికొద్దినెలల్లో ఇంకో తోడు రాబోతుందనమాట. మరి... ఈ వార్తలపై అల్లు ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.