దర్శకుడు డాలీ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటిస్తున్న చిత్రం 'కాటమరాయుడు'. ఎప్పుడో ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం ఈమధ్యే సెట్స్‌పైకి వెళ్లింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పవన్ ఈ సినిమా షూటింగ్‌తో బిజిబిజీగా ఉన్నాడు. హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ జరుగుతోంది. వీలైనంత చకచకా ఈ సినిమా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
అత్యంత విశ్వసనీయ సమాచారం ఏమిటంటే, వచ్చే ఏడాది మార్చి 29న తెలుగు నూతన సంవత్సరాది కానుకగా ''కాటమరాయుడు'' రిలీజ్ కానుంది. ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలావుంటే ఈ సినిమా సెట్లో జరిగిన సంఘటన టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇంతకీ ఆ సంఘటన ఏంటో తెలుసా... దర్శకుడు డాలీ ఓ సీన్‌ని కన్విన్సింగ్‌గా నేరేట్ చేసే విషయంలో తడబడటంతో, పవన్ కళ్యాణ్ గట్టిగా అరిచేశాడని, చాలసేపు కోపాన్ని కంట్రోల్ చేసుకున్నా.. చివరకు గట్టిగానే మాట్లాడాడట పవన్ కళ్యాణ్. తిరిగి సీన్లోకి వెళ్లేందుకు మూడ్ సహకరించకపోవడంతో అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడట పవన్ కళ్యాణ్. ఈ సంఘటన నిజమో కాదో తెలియదు కానీ ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.