పునర్నవి ఫోన్ చేస్తే రాహుల్ సిప్లిగంజ్ అలా అన్నాడా?

సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (13:49 IST)
రాహుల్ సిప్లిగంజ్, పునర్నవిల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బిగ్ బాస్ తరువాత వీరు చెట్టాపట్టాలేసుకుని తిరగడం.. ఎక్కడ చూసినా తెగ హడావిడి చేసేయడం కనిపించాయి. ఇది అందరికీ తెలిసిందే. అంతేకాదు ఇద్దరూ పెళ్ళి చేసుకుంటారని కుటుంబ సభ్యులే అనుకున్నారు. అంత క్లోజ్‌గా ఇద్దరూ వ్యవహరించారు. కానీ ఇప్పుడు పునర్నవి వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకోవడానికి సిద్థమైందట.
 
అది కూడా హైదరాబాద్‌కు చెందిన ఒక పారిశ్రామికవేత్తను పెళ్ళి చేసుకోవడానికి సిద్థమైందట పునర్నవి. గత వారంరోజుల పాటు ఆ పారిశ్రామికవేత్తతోనే ఎక్కువ సమయం గడుపుతోందట. ఈమధ్య కాలంలో అడపాదడపా రెండు సినిమాల్లో పునర్నవి నటించింది. ఆ తరువాత ఆమెకు సినిమాల్లో అవకాశాలు రాలేదు. కానీ ఇప్పుడు తన పెళ్ళిపైనే ఆమె ఎక్కువ దృష్టి పెట్టిందట. 
 
రాహుల్‌ను కాకుండా పునర్నవి వేరొకరిని పెళ్ళి చేసుకోవడానికి కారణాలు ఉన్నాయంటున్నారు ఆమె స్నేహితులు. రాహుల్ పాటలు పాడటంలో తెగ బిజీ అయిపోయి పునర్నవి ఫోన్లు చేస్తున్నా, కలవడానికి ప్రయత్నించినా బిజీగా ఉన్నానని చెబుతున్నాడని.. దీంతో పున్నుకు బాగా కోపమొచ్చి ఇలా డెసిషన్ తీసుకుందని టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు