రకుల్ ప్రీత్ సింగ్ ఇపుడు బిజీ షెడ్యూల్‌తో సినిమాలు చేస్తూ వెళుతోంది. ఒకే టైంలో చరణ్ 'ధృవ', సూపర్ స్టార్ మహేష్ - మురగదాస్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాలతో పాటుగా సాయిధరమ్ తేజ్ 'విన్నర్', నాగ చైతన్య సినిమాలని లైన్‌లో పెట్టింది. అయితే, ఇప్పుడు తేజ్, నాగ చైతన్య చిత్రాలు హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుటున్నాయి. ఈ రెండు చిత్రాల షెడ్యూల్స్‌లోనూ రకుల్ పాల్గొనాల్సి ఉంది.
దీంతో.. షిఫ్టుల వారీగా ఈ రెండు చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటుంది. ఈ కారణంగానే రకుల్‌ని ఇద్దరు హీరోలు ఒకే టైంలో వాడేసుకుంటారనే ప్రచారం ఫిల్మ్ నగర్‌లో జోరుగా సాగుతోంది. ఆ వాడకం ఏ రేంజ్‌లో ఉందనేది ఈ రెండు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత తెలుస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తేజ్ 'విన్నర్ ', సోగ్గాడే చిన్ని నాయనా' ఫేం కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగ చైతన్య సినిమాలు తెరకెక్కుతున్నాయి.