జబర్దస్త్ హాస్య నటుడు సుడిగాలి సుధీర్ 'సాఫ్ట్‌వేర్ సుధీర్' అనే చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన సరసన హీరోయిన్‌గా రాజుగారి గది ఫేమ్ ధన్య బాలకృష్ణన్ నటిస్తోంది. కానీ తొలుత హీరోయిన్ కోసం రష్మీని సంప్రదించారు. కానీ డేట్స్ అడ్జెస్ట్ కాలేకపోవడంతో ఆమె ఈ సినిమాకు నో చెప్పిందని సుధీర్ వెల్లడించాడు.
కాగా, రాజశేఖర్ రెడ్డి పులిచర్లని దర్శకుడిగా,శేఖర ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై పారిశ్రామికవేత్త కె.శేఖర్ రాజు ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ మొదటివారంలో సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ నేపథ్యంలో వినోదాత్మకంగా సాగే కమర్షియల్ చిత్రమిది అని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సినిమాలో సుధీర్ పవన్ కల్యాణ్, రజనీకాంత్‌లను అనుకరించడం హైలైట్‌గా నిలుస్తుందని చెప్పారు.