బాలికను మూత్ర విసర్జనకు సపోటా తోటకు తీసుకెళ్లిన నిందితుడు ఆత్మహత్య

ఠాగూర్

గురువారం, 23 అక్టోబరు 2025 (10:19 IST)
ఏపీలోని తునిలో ఓ దారుణ ఘటన జరిగింది. పాఠశాలకు వెళుతున్నఎనిమిదో తరగతి చదువుతున్న ఓ బాలికపై తాత వయసుండే వృద్ధుడు అఘాయిత్యానికి యత్నించాడు. ఆ కామాంధుడు పేరు తాటిక నారాయణ రావు. అయితే, ఆ బాలికను చూసిన స్థానికులు అతన్ని ప్రశ్నించగా, పొంతనలేని సమాధానాలు ఇస్తూనే, నేను ఎవరో తెలుసా.. బాలికను మూత్ర విసర్జనకు తీసుకొచ్చా.. ఇందులో తప్పేముంది అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. తక్షణం రంగంలోకి నిందితుడు నారాయణ రావును అరెస్టు చేశారు. 
 
ఆ తర్వాత నిందితుడుని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచేందుకు వ్యానులో తీసుకెళుతుండగా, మార్గమధ్యంలో బహిర్భూమికి వెళ్లాలని పోలీసులకు చెప్పాడు. దీంతో అతన్ని పోలీసులు వాహనం ఆపారు. దీంతో పట్టణ శివారులోని కోమటి చెరువులో దూకినట్టు పోలీసులు తెలిపారు. ఆ నిందితుడి కోసం గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా, చెరువులో నిందితుడి మృతదేహం లభ్యమైంది. 
 
మనవరాలి వయసున్న బాలికపై నారాయణ రావు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు స్థానికంగా ఉండే గురుకుల పాఠశాలలో చదువుకుంటోంది. ఆ బాలికకు తినుబండరాలు కొనిపెట్టి మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. తాను ఆమెకు తాతనంటూ పాఠశాల సిబ్బందిని కూడా నమ్మించాడు. బాలిక ఆరోగ్యం బాగోలేదని ఆస్పత్రికి తీసుకెళుతున్నానని నమ్మించి, స్థానికంగా ఉండే సపోటా తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు