దళపతి విజయ్ సంగీతను వివాహం చేసుకుని 24 ఏళ్లు అయింది. సంగీత ఒక సినిమా షూటింగ్ సమయంలో విజయ్‌ని కలిసింది. వెంటనే విజయ్ తల్లిదండ్రులు పెళ్లి ప్రతిపాదన చేశారు. ఆగస్ట్ 25, 1999న, విజయ్ - సంగీత వివాహం చేసుకున్నారు.
వీరికి జాసన్ సంజయ్, దివ్య సాషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి వివాహం శాశ్వతంగా ఉన్నప్పటికీ, విడాకుల పుకార్లు అప్పుడప్పుడు వెలువడుతున్నాయి. ఇటీవల, విజయ్- త్రిష కృష్ణన్‌ల మధ్య పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.
త్రిష- విజయ్ వారి చివరి చిత్రం లియోతో సహా పలు బ్లాక్ బస్టర్ చిత్రాలలో కలిసి పనిచేశారు. త్రిష విజయ్‌తో 50వ పుట్టినరోజు సందర్భంగా ఫోటోను షేర్ చేసింది. ఆమె చేసిన పోస్టు ప్రస్తుతం పుకార్లకు దారితీసింది.
విజయ్-త్రిష ప్రేమలో వున్నారని కోలీవుడ్ వర్గాల్లో టాక్ మొదలైంది. త్రిషతో విజయ్ ప్రేమలో వున్నారని.. సంగీతతో విజయ్ విడాకులు తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి.