ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
మే నెలలో సమంత పెళ్లి చేసుకోబోతోందంటూ టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. ఇక ఈ వార్త ఎప్పటిలాగే గాలివార్త అవుతుందో లేదంటే వాస్తవరూపం దాల్చుతుందో చూడాల్సి వుంది. ఇక అసలు విషయానికి వస్తే... సమంత తాజాగా తన ఇన్స్టా పేజీలో ఆసక్తికర వ్యాఖ్యలతో తన ఫోటోలను జత చేస్తూ పెట్టింది. ఈ క్యాప్షన్స్ మొత్తం అర్థం చూస్తే... తన శక్తిపై తనకు నమ్మకం వుందనీ, తన నియంత్రణ లేని విషయాల గురించి అస్సలు పట్టించుకోనని తేటతెల్లం చేసింది.