తెలుగు చిత్రపరిశ్రమలో మోస్ట్ లవబుల్ కపుల్‌గా అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంతలు గుర్తింపు పొందారు. త్వరలోనే వీరిద్దరు ఓ ఇంటివారు కానున్నారు. ఈ వివాహానికి సంబంధించి ఆసక్తికరమైన అంశం ఒకటి వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి అక్టోబర్ ఆరో తేదీన తమ వివాహం జరగనుందని చైతూ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కానీ, వేదిక ఎక్కడ అనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇపుడు ఓ స్పష్టత వచ్చింది.
సామ్- చై వివాహం గోవా వేదికగా మూడు రోజుల పాటు జరగనున్నట్టు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. వీకెండ్ వెడ్డింగ్ హిందూ, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జరగనుంది. ఈ వివాహ వేడుకకి కేవలం ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులతోపాటు, నాగార్జునతో మంచి సంబంధాలు కలిగిన పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు కూడా హాజరుకానున్నారు.
ఇక తొలి రోజు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరుగనుండగా, రెండో రోజు గోవాలోని ఓ చర్చిలో క్రిస్టియన్ వెడ్డింగ్ జరుపుతారట. అక్కడ రింగ్స్ మార్చుకొని ప్రతిజ్ఞ చేస్తారట. ఇక వెడ్డింగ్ తర్వాత హనీమూన్‌కి న్యూయార్క్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుండగా, 40 రోజుల పాటు యూఎస్ మొత్తం కవర్ చేసి వస్తారని సమాచారం.