ధనుష్-ఐష్‌లా సమంత-చైతూ విడాకులను రద్దు చేసుకుంటారా?
గురువారం, 6 అక్టోబరు 2022 (22:30 IST)
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత నుంచి విడాకులు తీసుకున్న స్టార్ హీరో నాగచైతన్య ప్రస్తుతం సామ్‌ను మరిచిపోలేకపోతున్నాడట. విడిపోయిన తర్వాత కూడా నాగచైతన్య సమంత కోసం తనకి ఇష్టమైన పనులు చేస్తున్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
సాధారణంగా సమంతకి గ్రీన్ నేచర్ అంటే చాలా ఇష్టం. నాగచైతన్య సమంత ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు కాస్త సమయం దొరికితే ఇద్దరూ కలిసి ఇంకా గార్డెనింగ్ చేసేవారట. అయితే నాగచైతన్య అదే అలవాటును ఇప్పటికీ వదులుకోలేక కంటిన్యూ చేస్తున్నాడట.
సమంత నాగ చైతన్య పక్కన లేకపోయినా... తన జ్ఞాపకాలతో తనని ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాడని తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన అక్కినేని అభిమానులు మళ్లీ మీరిద్దరూ కలిస్తే చూడాలని వుంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
కోలీవుడ్‌లో ధనుష్-ఐశ్వర్య తరహాలో వీళ్లు కూడా విడాకులను రద్దు చేసుకుంటే మంచిగా వుంటుందని ఆశిస్తున్నారు. మరి సమంత-చైతూ విడాకులను గట్టిగా పట్టుకుంటారో.. వెనక్కి తీసుకుంటారో అనేది.. ఊహకు అందని విషయమనే చెప్పాలి.