డాకు మహారాజ్ లో సోదరిగా నటించిన కలెక్టర్ పాత్ర ధారి శ్రద్దా శ్రీనాథ్ నటనకు మంచి మార్కులు వచ్చాయి. అందులోనూ హిట్ కావడంతో వెంటనే తమిళదర్శకుడు నుంచి ఆఫర్ వచ్చినట్లు తెలిసింది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ విజయం గురించి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు సీక్వెల్ జైలర్ 2 షూటింగ్ చేయబోతున్నారు.
త్వరలో సెట్ పైకి వెళ్ళనున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం శ్రద్దా శ్రీనాథ్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమన్నా, యోగిబాబు, వినాయకన్, రమ్యకృష్ణ తదితరులు నటిస్తున్నట్లు తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రజనీ కాంత్ కూలీ సినిమా బిజీలో వున్నారు. త్వరలో జైలర్ 2 వివరాలు తెలియనున్నాయి.