రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు వేయొద్దు : రజనీకాంత్

ఠాగూర్

మంగళవారం, 7 జనవరి 2025 (14:16 IST)
మీడియాపై సూపర్ స్టార్ రజనీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసంబద్దమైన ప్రశ్నలు అడగొద్దని అసహనం వ్యక్తంచేశారు. రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు అడగొద్దని ఎన్నిసార్లు చెప్పాలంటూ మండిపడ్డారు. తాను నటిస్తున్న తాజాగా చిత్రం "కూలీ". ఈ సినిమా షూటింగ్ కోసం ఆయన థాయ్‌లాండ్‌ కోసం వెళ్ళారు. ఈ సందర్భంగా ఆయన చెన్నై విలేకరులతో మాట్లాడుతూ, తన 'కూలీ' చిత్రం 70 శాతం షూటింగ్ పూర్తయింది. మిగిలిన షూటింగ్ ఈ నెల 13వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరుగనుంది. 
 
ఆ తర్వాత ఓ విలేకరి సమాజంలో మహిళల భద్రత గురించి ప్రశ్నించగా అసంబద్ధమైన ప్రశ్నలు వేయొద్దన్నారు. రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు తనను అడగవద్దని ఘాటుగా చెప్పారు. ఇటీవల చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో విలేకరి మహిళల భద్రతపై ప్రశ్నించగా.. రజనీకాంత్ తనని రాజకీయ ప్రశ్నలు అడగవద్దని అసహనం వ్యక్తంచేశారు.
 
కాగా, 'కూలీ' చిత్రం అప్‌డేట్‌ను రజనీకాంత్‌ పంచుకున్నారు. ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయిందని తెలిపారు. జనవరి 13 నుంచి జనవరి 28 వరకు మరో షెడ్యూల్‌ జరగనుందన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు పంచుకుంటామని చెప్పారు. 
 
రజనీకాంత్‌ 171 చిత్రంగా ‘కూలీ’ రూపుదిద్దుతున్న విషయం తెల్సిందే. 'లియో' తర్వాత లోకేశ్ కనగరాజ్‌ తెరకెక్కిస్తోన్న చిత్రమిది. బంగారం స్మగ్లింగ్‌ నేపథ్యంతో సాగే యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఇది సిద్ధమవుతోంది. నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్‌ షాహిర్‌, శ్రుతిహాసన్‌, సత్యరాజ్‌ ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు