సోనాల్ ఫ్యాషన్ మోడల్, గాయకురాలు, నటి కూడా. తెలుగులో బాలకృష్ణతోనే మూడు సినిమాల్లో నటించింది. అందులో లెజెండ్ హిట్ అయింది. డిక్టేటర్, రూలర్ ఏవరేజ్‌గా ఆడాయి. తాజాగా ఈ ఏడాది హిందీలో ది పవర్ అనే సినిమాలో నటిస్తోంది. తను గాయనిగా కూడా పాడిన పాటలకు ఆదరణకూడా పొందాయి. ఇప్పుడు కాస్త ఖాలీ టైంలో ఇలా పాటలకు మూవ్‌మెంట్స్ ఇస్తూ అభిమానులను అలరిస్తోంది.