స్టైలిష్ స్టార్ అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం 'పుష్ప'. కె.సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ అతలాకుతలమైంది. ఇపుడు సినీపరిశ్రమ మెల్లమెల్లగా కోలుకుంటోంది.
'రంగస్థలం'లో ఆదిపినిశెట్టి రోల్‌లాగే నారా రోహిత్ పాత్ర ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే.. హిట్టు, ప్లాఫ్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయే నారా రోహిత్ ఈ సారి ప్రధాన పాత్రలో ప్రేక్షకులను పలుకరించేందుకు సిద్దమవుతున్నాడన్నమాట.
మరోవైపు, టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ.. బన్నీపై ఉన్న ప్రేమతో స్పెషల్ గిఫ్ట్ పంపారు. ఆ గిఫ్ట్ ఏంటంటే రౌడీ వేర్ నుండి స్పెషల్‌గా డిజైన్ చేయబడ్డ టీషర్ట్, డిజైన్ మాస్క్‌లు, స్పెషల్ ట్రాక్. వీటిని చూసి ఫిదా అయిన అల్లు అర్జున్.. విజయ్ దేవరకొండకు థ్యాంక్స్ చెబుతూ వీటిని తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశాడు. ఇక వీరిద్దరి సినిమాల విషయానికి వస్తే బన్నీ త్వరలో 'పుష్ప' సినిమా చేయనుండగా, విజయ్ దేవరకొండ 'ఫైటర్' అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు.