'ఇండియన్-2'లో స్పెషల్ సాంగ్‌లో పాయల్ రాజ్‌పుత్

శుక్రవారం, 29 మే 2020 (22:49 IST)
విశ్వనటుడు కమల్ హాసన్ - సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఇండియన్-2 (భారతీయుడు-2). ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్‌ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. కానీ, ఇపుడు ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతం కోసం హీరోయిన్‌ పాయల్ రాజ్‌పుత్‌ను ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
కోలీవుడ్ తాజా సమాచారం మేరకు స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న'ఇండియ‌న్ 2' చిత్రంలో పాయ‌ల్ ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించ‌నుందట‌. అయితే ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. 
 
కాగా, పాయల్ రాజ్‌పుత్ "ఆర్ఎక్స్ 100" చిత్రంలో తన అందచందాలను ఆరబోసి, ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న విషయం తెల్సిందే. అయితే ఆ త‌ర్వాత ఈ అమ్మ‌డు న‌టించిన 'ఆర్డీఎక్స్ లవ్', 'వెంకీమామ' చిత్రాలు పాయ‌ల్‌కు పెద్ద‌గా పేరు తెచ్చి పెట్ట‌లేదు. రీసెంట్‌గా 'ఏ రైట‌ర్' అనే ల‌ఘు చిత్రంలో న‌టించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు