పెళ్లి చేసుకుని ఓ ఇంటికి ఇల్లాలైన సినీ నటి ఆర్తీ అగర్వాల్. ఆమె భర్తకు మౌత్ కిస్‌లను రుచి చూపించారో లేదోగానీ.. చిత్రంలో తన సరసన హీరోగా నటించే వారికి మాత్రం ఆ మద్దులు పవరేమిటో స్వయంగా చేసి చూపిస్తున్నారు. అలా.. ఆమె కూడా తన్మయత్వం చెందుతోంది. విహానంతరం ఆర్తీ హీరోయిన్‌గా చేస్తున్న చిత్రం "నీలవేణి".
ఈ చిత్రంలో ఈ అమ్మడు రెండు పాత్రల్లో కనిపిస్తోంది. మొదటి భాగంలో తన తనువు ప్రియుడికి అంకితం చేసే క్యారెక్టర్. ఈ సందర్భంలో బాలీవుడ్ మోడల్, నటుడు ముకుల్‌తో లిప్‌కిస్ ఇచ్చింది. ఈ కిస్‌కు సంబంధించిన ఫోటోలు హాట్ హాట్‌గా రాజధాని ఫిల్మ్ నగర్ వాసులు కళ్ళప్పగించి చూస్తున్నారు.
హాలీవుడ్ కల్చర్‌కు అలవాటైన ఆర్తీ.. ఇదంతా చిత్ర సన్నివేశంలో భాగమేనని జంకూబొంకూ లేకుండా చెపుతోంది. ఇలాంటివి భూతద్దంలో చూడరాదని హితవు పలుకుతోంది. హాలీవుడ్ చిత్రాల్లో ఇలాంటివి మామూలేనని, పైగా అక్కడ మనలాగా ఎక్స్‌పోజింగ్స్ పాటలు, సన్నివేశాలు ఉండని అంటోంది. సినిమాను సినిమాగానే చూడాలే గానీ మరో కోణంలో చూడరాదని నీతులు వల్లె వేస్తోంది. ఎంతైనా.. సినీ హీరియిన్ కదా.