అక్షయ్ కుమార్ పక్షిరాజుగా నటించిన ఈ చిత్రం పూర్తి సైంటిఫిక్ ఫిక్షన్‌లో తెరకెక్కింది. ఈ చిత్రం ఇప్పటివరకు రూ.700 కోట్ల మేరకు వసూలు చేసినట్టు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా ఇప్నటివరకు రూ.710.98 కోట్లు వసూలు చేసిందని, రెండు వారాల్లో తమిళనాడులో రూ.166 కోట్లు రాబట్టిందని ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ తెలిపారు. ఇప్పటికీ అమెరికాలో '2.O' వందకు పైగా థియేటర్లలో సినిమాను ప్రదర్శిస్తున్నారు.
ఈ చిత్రం మొదటి వారంలో రూ.526.86 కోట్లు వసూలు చేయగా, రెండో వారంలో తొలి రోజున రూ.27.31 కోట్లు, 2వ రోజున రూ.32.57 కోట్లు, 3వ రోజున రూ.36.465 కోట్లు, 4వ రోజున రూ.39.20 కోట్లు, 5వ రోజున రూ.17.13 కోట్లు, 6వ రోజున రూ.14.66 కోట్లు, 7వ రోజున రూ.16.80 కోట్లు కలిపి మొత్తం రూ.710.98 కోట్లు వసూలు చేసినట్టు ఆయన వెల్లడించారు.