పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఇది వర్తిస్తుంది. అయితే కొన్ని బస్సుల్లో ఈ సౌకర్యం లేదు. నాన్ స్టాప్, ఇతర రాష్ట్రాలకు వెళ్ళే బస్సుల్లో కూడా ఈ సౌకర్యం ఉండదు. ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సులకు పథకం వర్తించదు.
ఈ సంఖ్య 26 లక్షలకు పెరుగుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ఉచిత బస్సు పథకం వల్ల ఆర్టీసీకి నష్టం రాకుండా ప్రభుత్వమే డబ్బులు ఇస్తుందన్నారు. అంతర్రాష్ట్ర బస్సుల్లో కూడా రాష్ట్రం వరకు ఉచిత ప్రయాణం గురించి ఆలోచిస్తుమన్నారు. దీనిపై త్వరలో మరో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం కోసం ఆధార్ జిరాక్స్ కాపీలను కూడా అనుమతించాలని ఆదేశించామన్నారు.