ఈసందర్భంగా ఆర్‌పీ పట్నాయక్ మాట్లాడుతూ '' ఈ చిత్ర కథానాయకుడు చాలా కాలంగా తెలుసు. జెమిని సురేష్ ఈ సినిమా గురించి చాలా చెప్పాడు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పే వాడు. ఈ సినిమాకు చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఈ సినిమా అందరిని 90వ దశకంలోకి తీసుకెళ్లి మీ జ్ఞాపకాల్ని గుర్తుకు తెస్తుంది. అందరికి వాళ్ల వాళ్ల ప్రేమకథలు కూడా గుర్తుకు వస్తాయి. ఈ సినిమా విజయం సాధించి టీమ్ అందరికి మంచి గుర్తింపు తీసుకరావాలి' అన్నారు.
జెమిని సురేష్ మాట్లాడుతూ '' సినిమా పరిశ్రమలో స్థిరపడాలనే సంకల్పంతో సువిక్షిత్ ఈ సినిమా తీశాడు. ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడ్డాడు. 90వ దశకంలోని పూర్తి డిటైల్డ్‌గా దర్శకుడు సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా అందరిని మళ్లీ మీ చిన్ననాటి గోల్డెన్‌డేస్‌కు తీసుకవెళుతుంది. చాలా రోజుల తరువాత నాకు ఈ చిత్రంలో మంచి పాత్ర దొరికింది. దూరదర్శిని సినిమా నటుడిగా నాకు ఓ ప్రత్యేక సినిమాగా ఉంటుంది' అన్నారు.
గీతిక మాట్లాడుతూ '' దూరదర్శిని సినిమా చాలా మంచి చిత్రం. తప్పకుండా అందరికి తమ మరపురాని రోజులను గుర్తుకు తెస్తుంది. నాకు ఈ చిత్రంలో అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషపడుతున్నాను. ఈ సినిమాలో దూరదర్శిని వాణి, హరిల ప్రేమను ఎలా కలిపింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది' అన్నారు.
సువిక్షిత్ మాట్లాడుతూ '' 1990వ నేపథ్యంలో నడిచే కథ. అందరికి కనెక్ట్ అయ్యే కథ ఇది. బ్యాక్‌డ్రాప్‌కు తగ్గ నటీనటులతో, లోకేషన్స్‌తో ఎంతో సహజంగా తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమా కోసం అందరం ఎంతో రీసెర్చ్ చేసి ఎంతో డిటైల్డ్‌గా దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమాలో ఉన్న ఎమోషనే ఈ చిత్రంలోని ప్లస్ పాయింట్. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇది నా కథ అనుకుంటారు. అందరూ ఎంతోగా కనెక్ట్ అవుతారు. తప్పకుండా చిత్రాన్ని అందరూ ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు'' అన్నారు. ఈ సమావేశంలో దర్శకుడు కార్తియక కొమ్మి, తిరుపతి రెడ్డి, నారాయణ, కొరియోగ్రాఫర్ సునీల్ పొన్నం, బాలారాజు, తేజ, పాండు, జెమిని సురేష్, గీతిక, డీఓపీ సతీష్, తదితరులు పాల్గొన్నారు.
నటీనటులు: సువిక్షిత్ బొజ్జ, గీతిక రతన్, జెమిని సురేష్, లావణ్య రెడ్డి, కిట్టయ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఆనంద్ గుర్రాన,