Game changer DHOP, చెర్రీ-కియారా ధోప్ సాంగ్ సోషల్ మీడియాలో షేక్ (Video)

ఐవీఆర్

గురువారం, 26 డిశెంబరు 2024 (19:35 IST)
రామ్ చరణ్ (Ram Charan), కియరా (Kiara Adwani) జంటగా నటించిన గేమ్ ఛేంజర్ (Game changer) చిత్రంలో క్రేజీగా సాగే డోప్ (DHOP) సాంగ్‌ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. డైరెక్ట‌ర్ శంక‌ర్ త‌న‌దైన శైలిలో మ‌రోసారి మేకింగ్‌లో త‌నేంటో ఈ సాంగ్‌తో ప్రూవ్ చేశారు. త‌మ‌న్ కంపోజిష‌న్ దీనికి పెద్ద ఎసెట్‌గా మారింది. రామ‌జోగ‌య్య‌శాస్త్రి రాసిన ఈ పాట‌ను తమిళంలో వివేక్, హిందీలో రక్వీబ్ ఆలం రాశారు. అలాగే తెలుగులో ఈ పాటను తమన్ ఎస్, రోషిణి, పృథ్వీ శ్రుతి రంజని ఆలపించగా.. తమిళంలో తమన్ ఎస్, అదితీ శంకర్, పృథ్వీ.. హిందీలో తమన్ ఎస్, రాజకుమారి, పృథ్వీ శ్రుతి రంజని ఆలపించారు. పాట‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌స్తోంది. పాట‌లో అక్క‌డ‌క్క‌డ రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ వేసిన డాన్స్ ఎంతో క్యూట్‌గా ఉంది.
 

Daily Dose of #Dhop pic.twitter.com/qcVO30ZyE6

— η????????η???? (@Naani_PSPK) December 23, 2024

ఇప్పటికే గేమ్ చేంజ‌ర్ మూవీ నుంచి రిలీజైన .. జరగండి, రా మచ్చా మచ్చా, నా నా హైరానా అనే పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటి స‌ర‌స‌న డోప్ సాంగ్ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోంది. రామ్ చ‌ర‌ణ్.. గేమ్ చేంజర్ చిత్రంలో రెండు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్‌.యు.వెంక‌టేశ‌న్‌, వివేక్ రైట‌ర్స్‌గా వ‌ర్క్ చేశారు. హ‌ర్షిత్ స‌హ నిర్మాత‌. ఎస్‌.తిరుణ్ణావుక్క‌ర‌సు సినిమాటోగ్ర‌ఫీ, ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా సాయి మాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాశారు.
 

#Dhop Dopamine Everywhere #DhopSong @AlwaysRamCharan @advani_kiara @MusicThaman @GameChangerOffl #GameChanger #RamCharan pic.twitter.com/mEb6MFBH3i

— RC Nation (@bharathholic) December 25, 2024
న‌ర‌సింహా రావు.ఎన్, ఎస్‌.కె.జ‌బీర్‌ లైన్ ప్రొడ్యూస‌ర్‌గా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా అవినాష్ కొల్ల‌, యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్స్‌గా అన్బ‌రివు, డాన్స్ డైరెక్ట‌ర్‌గా ప్ర‌భుదేవా, గ‌ణేష్ ఆచార్య‌, ప్రేమ్ రక్షిత్‌, బాస్కో మార్టిస్, జానీ, శాండీ వ‌ర్క్ చేస్తున్నారు. రామ్ జోగ‌య్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్‌, కాసర్ల శ్యామ్ పాట‌ల‌ను రాశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు