ఇక ప్రస్తుతం సిలాస్ హోవార్డ్ దర్శకత్వంలో "ఎ కిడ్ లైక్ జాక్" అనే చిత్రం చేస్తుంది. హాలీవుడ్ నటులు జిమ్ పార్సన్స్, క్లైరే డేన్స్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అమల అనే పాత్రలో ప్రియాంక నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది.
దీంట్లో కేవలం మూడు సెకన్లు మాత్రమే ప్రియాంక కనిపించడంతో అభిమానులు అప్‌సెట్ అయ్యారు. గతంలో బేవాచ్ ట్రైలర్‌లోను ప్రియాంకని కొద్ది సేపే చూపించారు. సన్‌డ్యాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ సినిమా ఇప్పటికే ప్రదర్శితం కాగా, నాలుగు ఏళ్ళ చిన్నారి జాక్ చుట్టూ ఈ సినిమా సాగనుంది.