అభినయ ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. రవితేజ హీరోగా వచ్చిన నేనింతే చిత్రం ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన అభినయ అనంతరం కింగ్, సంగమం, శంభో శివ శంభో, దమ్ము, ఢమరుకం, జీనియస్ తదితర చిత్రాల్లో చిన్నా చితకా పాత్రల్లో నటించారు. ఇక మహేష్ బాబు వెంకటేష్ హీరోలుగా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వారికి చెల్లెలు పాత్రలో నటించి అభినయ మరింత గుర్తింపు సంపాదించుకున్నారు