ప్రమాదంలో అజిత్ చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అజిత్ గాయపడ్డారనే వార్తతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అజిత్ గాయపడటంతో షూటింగుకు కొన్ని రోజుల పాటు దూరం కానున్నాడు.
కాగా, 'వలిమై' సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. హెచ్.వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రంలో అజిత్‌కు జోడిగా హ్యూమా ఖురేషి నటిస్తోంది.