సీతాకోకచిలుక, అభినందన, అన్వేషణ, మగరాయుడు లాంటి సినిమాలలో కనిపించిన నటుడు కార్తీక్ సుపరిచితుడే. అంతేకాదు మణిరత్నం ఘర్షణ మూవీ ఆయనకు తెలుగులో మంచి పేరు తెచ్చింది. అయితే ఈ సీనియర్ హీరో ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల బిజీలో ఉన్నారు.
బీజేపీ-అన్నాడీఎంకే కూటమి అభ్యర్థుల తరఫున కార్తీక్ ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగనే శనివారం రాత్రి ప్రచారం ముగించుకుని ఇంటికి చేరారు కార్తీక్. ఈ నేపథ్యంలో అర్థరాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆస్పత్రి తరలించారు. ఆయన శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. త్వరలోనే ఆయన కోలుకుంటారని వైద్యులు స్పష్టం చేశారు.
కార్తీక్ 2006లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు 2018 లో ఏర్పడిన మణిద ఉరిమైగల్ కాక్కుం కట్చికి నాయకత్వం వహిస్తున్నారు. కార్తీక్ 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎఐఎడిఎంకెతో తన కూటమిని ప్రతిజ్ఞ చేసి, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎఐఎడిఎంకె నేతృత్వంలోని కూటమి కోసం ప్రచారం కొనసాగిస్తున్నారు.