జయలలిత మరణంతో తమళనాడు రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకం : ప్రకాష్ రాజ్

ఆదివారం, 26 మార్చి 2017 (10:28 IST)
ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంతో తమిళనాడు రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని సినీ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై ఆయన ఓ ప్రైవేట్ టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 
 
జయలలిత మరణానంతం అందరికీ మాట్లాదే ధైర్యం వచ్చిందన్నారు. జయలలిత మరణం తర్వాత బాధ్యతాయుతమైన నాయకుడు లేడని, తమిళ ప్రభుత్వం భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. స్పష్టంగా చెప్పాలంటే ప్రస్తుత ప్రభుత్వపాలనే ప్రశ్నార్థకంగా ఉందని వ్యాఖ్యానించారు. 
 
అనూహ్యంగా నాయకుడిని ఎంచుకోరాదన్నారు. వారి కోసం ప్రజలు ఓట్లు వేయలేదని, శాసనసభ్యుల మద్దతు ఉన్నా వారిని ఆ నాయకురాలి కోసమే ప్రజలు ఎన్నుకున్నారన్నది మరచిపోరాదన్నారు.
 
జల్లికట్టు క్రీడ కోసం యువత చాలా ప్రశాంతంగా, కలిసి కట్టుగా పోరాడి సాధించుకున్నారన్నారు. తాము వారికి మద్దతు పలికామన్నారు. అలాంటి జల్లికట్టు పోరాటంలో పోలీసుల హింసాత్మక చర్యలతో అది పెను వివాదంగా మారిందన్నారు. 

వెబ్దునియా పై చదవండి