"మా" అధ్యక్షుడు, టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ సతీమణి విజయ చాముండేశ్వరి శనివారం కోర్టు మెట్లెక్కారు. ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె కోర్టుకు రావడం వెనుక ఓ చెక్ బౌన్స్ కేసు కావడం గమనార్హం.
కడపకు చెందిన ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, బిజినెస్‌మేన్ జయభరత్ రెడ్డి కేసుపెట్టాడు. గతంలో జయభరత్ రెడ్డి దగ్గర విజయ రూ.25 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఈ అప్పును తిరిగి చెల్లించే నిమిత్తం 2016లో ఆమె ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో ఆమెపై జయభరత్ రెడ్డి చెక్ బౌన్స్ కేసు పెట్టారు.
ఈ కేసు విచారణ నిమిత్తం ఆమె కోర్టుకు హాజరయ్యారు. అయితే, కేసు విచారణని న్యాయస్థానం ఈ నెల 21కి వాయిదా వేసింది. వరుస సినిమాలతో బిజీగా ఉండే రాజేంద్ర ప్రసాద్ సతీమణి చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు రావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.