టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన "యశోద" సినిమా బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తూ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో సమంత నటన సినిమాకే హైలైట్‌గా నిలిచిందని, ఈ సినిమా మంచి సక్సెస్‌ను సాధించడంలో సమంత కీలక పాత్ర పోషించిందనే టాక్ వస్తోంది.
ఇటీవల, సమంతా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక వీడియోను పంచుకుంది. ఈ బీటీఎస్ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సినిమా కోసం చాలా కష్టపడటం చూడవచ్చు. ఈ సినిమాకు సమంత ఫైటింగ్ సీన్స్ హైలైట్‌గా నిలిచింది.