50 సినిమాలకు డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసిన సీనియర్‌మోస్ట్ కొరియోగ్రాఫర్ స్వర్ణ మాస్టర్ దర్శకురాలిగా మారారు. ఇన్నేళ్ల తన అనుభవంతో మెగాఫోన్ పట్టుకుని తొలిసారిగా ఓ క్యూట్ లవ్ స్టోరీతో వస్తున్నారు. యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వస్తోన్న సినిమా ఇది. అందరూ కొత్తవాళ్లే నటించిన ఈ సినిమా ట్రైలర్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ .. ‘‘850 సినిమాలకు డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసిన స్వర్ణ మాస్టర్ డైరెక్ట్ చేసిన అది ఒక ఇదిలే ట్రైలర్ నా చేతుల మీదుగా విడుదల చేయడం ఆనందంగా ఉంది. ట్రైలర్ బావుంది. ట్రైలర్ చూస్తే ఓ క్యూట్ లవ్ స్టోరీలా కనిపిస్తోంది. ఓ ఫ్లాట్లో ఉండే యువత మధ్య జరిగే ప్రేమకథగా నాకు అర్థమైంది.