కేవలం ఒక నిమిషం నిడివితో కట్ చేసిన ఈ టీజర్ తో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పారు. ఎంతవారుగాని సినిమాలో ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు సస్పెన్స్, రొమాన్స్ కూడా ఉంటుందని ఈ వీడియో ద్వారా వెల్లడించారు. యూత్ ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్ తో ఈ సినిమా రూపొందుతోందని తెలుస్తోంది. ఈ టీజర్ చూసిన అడవిశేష్ ఎంతో బాగా వచ్చిందని చెబుతూ చిత్రయూనిట్ ని అభినందించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
దర్శకుడు శ్రీనివాసన్. ఎన్ ని నివాస్ అనే పేరుతో తన 'రంగీలా' సినిమాతో ఎడిటర్ గా పరిచయం చేశారు రామ్ గోపాల్ వర్మ. ఆ తర్వాత 'క్షణ క్షణం', 'గాయం', 'గోవిందా గోవిందా', 'రాత్రి', 'అంతం', 'ద్రోహి', 'మనీ', 'అనగనగ ఒక రోజు', 'మృగం', 'రాత్', 'మనీ మనీ' సినిమాలకు ఆయన సౌండ్ ఇంజినీర్ గా పని చేసి అవార్డులను అందుకున్నారు. ఇప్పుడు 'ఎంతవారుగాని' అనే ఈ సినిమాతో దర్శకుడిగా తన టాలెంట్ చూపించబోతున్నారు శ్రీనివాస్ ఎన్.