అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై యువ నిర్మాతలు బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఆడియో ఆల్బమ్ నుంచి ఇటీవల మొదటి పాటను విడుదల చేశారు. బ్లాక్ బస్టర్ మూవీ గీత గొవిందం చిత్రంలో ఇంకేం… ఇంకేం…. ఇంకేం… కావాలి…. అనే సెన్సేషనల్ సాంగ్‌ని అందించిన మ్యూజికల్ కాంబోని మళ్ళీ ఈ చిత్రం ద్వారా రిపీట్ చేశారు.
మనసా…. మనసా… మనసారా… బ్రతిమాలా.. అంటూ సాగే ఈ సాంగ్ ప్రస్తుతం ట్రెండ్ అవ్వడమే కాకుండా యూట్యూబ్‌లో తక్కువ టైంలోనే ట్రెండింగ్‌కి రావటం విశేషం. 3 మిలియన్ వ్యూస్ దాటి 5 మిలియన్ దిశగా పరుగులు తీస్తుంది. జీఏ 2 బ్యానర్ నుంచి గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ గీతగోవిందం ఆడియో ఒక సంచలనమే అని చెప్పాలి. మళ్లీ అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఆడియో కూడా అదే స్ధాయిలో విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.
గోపీసుందర్ కంపోజ్ చేసిన ఈ ఆల్బమ్ లో సిడ్ శ్రీరామ్ పాడిన ఈ పాట మంచి సక్సస్ సాధించడం యూనిట్ నమ్మకాన్ని నిజం చేసినట్టు అయ్యింది. ఈ పాటకి ఎన్నో మంచి పాటలకి సాహిత్యాన్ని అందించిన సురేందర్ కృష్ణ లిరిక్స్ అందించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. శరవేగంగా షూటింగ్ చేస్తున్న ఈ మూవీ కోసం అఖిల్, పూజా హేగ్డేలపై ఓ పాటను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు.