అనసూయకు నటన రాదా..? పరమ చెత్త నటి అంటూ అలీ కొట్టబోయాడా?

మంగళవారం, 26 జులై 2016 (17:24 IST)
సినీ ఇండస్ట్రీలో బాలనటుడిగా అడుగుపెట్టిన అలీ.. హీరోగా హిట్ అయినా కమెడియన్‌గా మంచి మార్కులు కొట్టేశాడు. వెండితెర, బుల్లితెరలతో పాటు ఆడియో ఫంక్షన్లలోనూ తన హవాను కొనసాగిస్తున్న అలీ.. యాంకర్‌గా, వ్యాఖ్యాతగానూ అలరిస్తున్నాడు. ఇటీవల డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ఆడవారిని ఇబ్బంది పడేలా మాట్లాడుతూ వార్తల్లో నిలిచిన అలీతో అయితే తాము చేయమని సహ యాంకర్లు తప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయట. 
 
ఇక సైమా అవార్డ్ ఫంక్షన్ వేడుకలో ఐతే.. సీనియర్ హీరోయిన్ సుహాసిని అలీకి క్లాస్ కూడా పీకింది. ఏది ఏమైనా తొలుత కామెంట్ చేసి ఆపై సర్దిచెప్పడంలో అలీ దిట్ట. ఓకే ఈ విషయాలను పక్కనబెడితే.. అనసూయను అలీ కొట్టబోయాడా అనేదానిపై ఆరాతీస్తే.. అనసూయకు నటన రాదని తిట్టి.. చెంప దెబ్బ కూడా వేయబోయాడట. అనసూయతో పాటు.. పక్కనే ఉన్న మరో కమెడియన్ రఘుకి కూడా వార్నింగ్ ఇచ్చాడట.
 
కానీ ఇదంతా రియల్ మాత్రం కాదు. సినిమా అవార్డ్స్ కోసం సాగర సంగమం స్పూఫ్‌గా చేసిన బిట్‌లో ఇదంతా జరిగింది. సాగర సంగమం మూవీలో శైలజ డ్యాన్స్‌కు అందరూ పొగుడుతూ రాస్తే.. ఒక్క బాలు (కమల్ హాసన్) మాత్రమే పరమ చెత్తగా ఉన్నదని రాస్తాడు. దీనినే ఇమిటేట్ చేస్తూ.. అనసూయ నటనను అందరూ పొగుడుతూ రాస్తే... అలీ మాత్రం అనసూయని పరమ చెత్త నటి అంటూ పేపర్‌లో రాస్తాడు. అంతేకాదు కొట్టబోతాడు కూడా. ఇదండీ సంగతి. ఈ స్పూఫ్‌ను చూసి సినిమా అవార్డ్స్ కార్యక్రమానికి హాజరైన హీరోలు, అతిథులు, ప్రేక్షకులంతా కడుపుబ్బ నవ్వుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి