విమానంలో లాస్ ఏంజెల్స్ వెళ్ళి అక్కడ టెక్నికల్ టీమ్ ను కలిసిన వివరాలు తెలియజేశారు. అల్లు అర్జున్, అట్లీ కలిసి లాస్ ఏంజెల్స్ లో లోలా విఎఫ్.ఎక్స్. టీమ్ ను కలిశారు. అదేవిధంగా స్ప్రెక్టర్ మోషన్ టీమ్, ఫ్రాక్ట్రడ్ టీమ్, ఐరెన్ హెడ్ స్టూడియో, లెజెసీ ఎఫెక్ట్స్ స్టూడియోలకు వెళ్ళారు. అక్కడ సి.ఇ.ఓ. జోస్ ఫెర్నాండెజ్ తో కలిసి అల్లు అర్జున్ 22వ సినిమా గురించి చర్చించారు. విఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్, డైరెక్టర్ జేమ్స్ మాడిగన్ తో మాట్లాడారు. ఈ స్క్రిప్ట్ వినగానే మైండ్ బ్లోయింగ్ లా అనిపించిందని జేమ్స్ తెలియజేడం విశేషం.