నానితో జోడీ కట్టక ముందే సూపర్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్‌గా ఫైనల్ అయ్యింది. తాజాగా, మెగా ఫ్యామిలీ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలోనూ హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో బన్ని కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న "డీజే.. దువ్వాడ జగన్నాథం" షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు బన్ని. ఇందులో బన్ని సరసన పూజా హెగ్డే జతకడుతోంది. ఈ చిత్రం తర్వాత లింగుస్వామి చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. మొత్తానికి వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోలతో జతకట్టే చాన్స్ కొట్టేస్తోంది కీర్తి సురేష్. ఆమె గ్లామర్‌నే ఆమెకి వరుసగా ఆఫర్లు తెచ్చిపెడుతుందనే న్యూస్ సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తోంది.