Kurnool Bus Accident: డీఎన్ఏ ప్రొఫైలింగ్ 48 గంటలు పడుతుంది.. అక్టోబర్ 27 నాటికి పూర్తి

సెల్వి

శనివారం, 25 అక్టోబరు 2025 (12:06 IST)
Kurnool Bus Accident
ఆంధ్రప్రదేశ్ బస్సు అగ్ని ప్రమాదంలో బాధితుల డీఎన్ఏ ప్రొఫైలింగ్ 48 గంటలు పడుతుందని, అక్టోబర్ 27 నాటికి పూర్తవుతుందని శనివారం ఒక అధికారి తెలిపారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది ప్రయాణికులు, ఒక మోటార్ బైక్ రైడర్ సజీవ దహనమయ్యారు. 
 
బస్సులో 44 మంది ప్రయాణికులు ఉన్నారు. చాలామంది మంటల నుండి తప్పించుకున్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్ ఎ సిరి మాట్లాడుతూ 19 మృతదేహాల నుండి నమూనాలను సేకరించి విజయవాడలోని ఫోరెన్సిక్ సైన్సెస్ లాబొరేటరీకి పంపినట్లు తెలిపారు. 
 
"డిఎన్ఎ ప్రొఫైలింగ్‌కు 48 గంటలు పడుతుందని నాకు సమాచారం అందింది. ఫలితాలు వచ్చినప్పుడు ఆ మృతదేహాలను వాటి సంబంధిత ప్రదేశాలకు తరలించడానికి మేము ఆ రోజు అంబులెన్స్‌లు, వాహనాలను కూడా ఏర్పాటు చేస్తున్నాము.."అని సిరి తెలిపారు. 
 
19 మృతదేహాలలో ఒకరిని గుర్తించలేకపోయామని, డిఎన్ఎ ప్రొఫైలింగ్ మృతదేహాలను వారి కుటుంబ సభ్యులతో సరిగ్గా సరిపోల్చుతుందని ఆమె అన్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్ ఎ సిరి మాట్లాడుతూ 19 మృతదేహాల నుండి నమూనాలను సేకరించి విజయవాడలోని ఫోరెన్సిక్ సైన్సెస్ లాబొరేటరీకి పంపినట్లు తెలిపారు. డిఎన్ఎ ప్రొఫైలింగ్ కు 48 గంటలు పడుతుందని సమాచారం అందిందని సిరి వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు