అల్లు వంశంలో అర్జున్ ఇప్పటికే పెళ్లిచేసుకుని తండ్రికూడా అయ్యాడు. తన స్నేహితులుకూడా పెండ్లి చేసేసుకున్నారు. వారందరినీ చూస్తుంటే తనకూ ఓ తోడు కావాలని అనిపించింది అల్లు శిరీష్‌కు. అందుకే తన మనసులోని మాటను ఈరోజు బయట పెట్టాడు. ఓ ఫంక్షన్‌కు హాజరైన ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఏమన్నాడంటే, మ్యారేజ్, లవ్ గురించిన విషయాలు నాకూ తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే నాకు పెళ్లి వయసు వచ్చింది. భాయ్ ఫ్రెండ్ అనేది బాగానే ఉంటుంది కానీ, హజ్బెండ్ అంటేనే భయంగా ఉంది. అంటూ వ్యాఖ్యానించాడు.