'అంటే.. సుందరానికీ!' మూవీ ఒక బ్రాహ్మణ కులానికి చెందిన హీరో.. క్రిస్టియన్ అమ్మాయి ప్రేమలో పడడం.. వీళ్ల పెళ్లిని పెద్దలు ఒప్పుకోకపోవడం.. చివర్లో హీరోకు ఏదో సమస్య ఉందని తెలిసిపోవడం వంటి విభిన్నమైన అంశాలతో తెరకెక్కింది. అలాగే, ఇందులో హీరో నానికి ఏదో సమస్య ఉందని సస్పెన్స్‌గా ఉంచేసి ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెంచేశారు.
కథ బాగుండటం.. నాని, నజ్రియా యాక్షన్ సినిమాకు ప్లస్ అయ్యింది. అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు ఊహించని విధంగా మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఇది బాగుందని కొందరు, పర్వాలేదని ఇంకొందరు అంటున్నారు.
'అంటే.. సుందరానికీ' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడానికి చాలా సమయం తీసుకున్నాడు దర్శకుడు. పాత్రలను పరిచయం చేయడం.. వాళ్ల వెనుక నేపథ్యాన్ని చూపించడానికే ఎక్కువ సమయం పట్టిందని చెప్పవచ్చు. అయితే, సెకెండాఫ్ మాత్రం అదిరిపోయే కామెడీతో అలరించే విధంగా తీశాడట. మొత్తంగా రెండో సగమే బాగుందని టాక్ వస్తోంది.
సినిమా ప్లస్... మైనస్‌లు
'అంటే.. సుందరానికీ మూవీలో నాని, నజ్రియా యాక్టింగ్ ఇరగదీసేశారట. అలాగే, వన్ లైన్ కామెడీ డైలాగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీలు ఈ సినిమాకు ప్లస్ అంటున్నారు. అయితే, ఫస్టాఫ్, పాటలు, ఎమోషన్స్ పండకపోవడం, సినిమా నిడివి ఎక్కువగా ఉండడం ఈ సినిమాకు మైనస్‌గా మారాయని చెప్తున్నారు.