అనుష్క షెట్టి.. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ఇమె కూడా ఒకరు. ఈ భామ తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. అయితే అదేక్రమంలో ఈ భామకు వయసు సైతం ముదిరిపోవడంతో త్వరలోనే పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు అనుకుంటున్నారట. టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరితో స్వీటి ప్రేమలో మునిగిపోయిందని…. సదరు నిర్మాతతో అనుష్క చెట్టాపట్టాల్ వేసుకుని తెగ తిరిగేస్తోందట.
స్వీటీ ప్రేమిస్తున్న నిర్మాతకు గతంలోనే ఆల్‌రెడీ పెళ్లైందట. ఇక అదేక్రమంలో…. తన సినిమాలో హీరోయిన్‌గా నటిస్తూనే.. లవర్‌తో రొమాన్స్ చేస్తుందని సమాచారం. అతడితో కలిసి ప్రేమలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తోందట. ఇక ఈ విషయం తెలుసుకున్న రెండు కుటుంబాలు… వీరి పెళ్ళికి ఒకే చెప్పడంతో త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట.
ఇదిలావుంటే... డిసెంబర్‌లో స్వీటీ నటించిన సింగం-3 విడుదల కానుండగా, 2017 ఏప్రిల్ 28న బాహుబలి-2 విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత అనుష్క మళ్లీ సినిమాల్లో నటించే అవకాశం లేదని, అందుకే ఆమె కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈనేపథ్యంలో స్వీటీ వ్యాపారవేత్తను వివాహం చేసుకోనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఏది ఏమైనా… చేతి నిండా… సినిమాలతో బిజీగా గడిపేస్తున్న ఈ బ్యూటీ… ఎంత త్వరగా శ్రీమతిగా మారుతుందో చూడాలి.