గుణశేఖర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనుష్క.. నో చెప్పిన పూజా హెగ్డే..?
గురువారం, 22 అక్టోబరు 2020 (16:23 IST)
Pooja Hegde_Anushka shetty
దర్శకుడు గుణశేఖర్ భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట. తాజాగా గుణశేఖర్ 'శాంకుతలం' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఇందులో అనుష్క ప్రధాన పాత్రలో నటించనున్నారట.
మొదట ఈ పాత్రకు గానూ పూజా హెగ్డేను సంప్రదించారని, ఆమె అంత ఆసక్తిని చూపలేదని టాక్. ఆ తరువాత అనుష్కను సంప్రదించారట ఆమె ఓకే చెప్పారని సమాచారం.
గతంలో అనుష్క, గుణశేఖర్ దర్శకత్వంలో రుద్రమదేవిలో నటించారు. ఈ క్రమంలో గుణశేఖర్ పని గురించి బాగా తెలిసిన అనుష్క, ఇప్పుడు శాకుంతలంకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ మూవీకి దేవసేన ప్రధానాకర్షణగా మారనున్నారు.
ఇక దాదాపు ఐదు సంవత్సరాల గ్యాప్ తరువాత టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. హిరణ్యకశ్యప కంటే ముందు తెరకెక్కిస్తున్నట్లు గుణశేఖర్ తెలిపారు. మహాభారత 'ఆదిపర్వం'లోని ఓ ప్రేమకథాంశంగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు ఆయన ప్రకటించారు.