టాలీవుడ్ అగ్ర హీరోయిన్ అనుష్క నిర్మాతను పెళ్లి చేసుకోనుందని టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. అరుంధతి, రుద్రమదేవి లాంటి సూపర్ హిట్స్ చిత్రాలతో ఆ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ ప్రస్తుతం బాహుబలి 2, భాగమతి చిత్రాలతో బిజీగా ఉంది. తాజాగా ఈ అమ్మడి ప్రేమ వ్యవహారంఫై కోలీవుడ్‌లో రచ్చ రచ్చగా ఉంది. టాలీవుడ్ బడా నిర్మాతతో కొంతకాలంగా అనుష్క ప్రేమాయణం సాగిస్తుందని తెలిసింది. త్వరలోనే ఆ నిర్మాతతో పెళ్లి కూడా చేసుకోబోతోందనే వార్త షికార్లు చేస్తోంది.
ఇక అసలు విషయం ఏమిటంటే..? ఆ నిర్మాతకు ఇప్పటికే పెళ్ళైపోయింది. సదరు నిర్మాతతో రెండు, మూడు సినిమాలు చేసిన అనుష్క సెకండ్ హ్యాండ్ వ్యక్తిని పెళ్ళి చేసుకోబోతుందా అంటూ ఆమె అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. కానీ సినీ ప్రపంచంలో ఇదంతా మామూలేనని సినీ పండితులు అంటున్నారు. మరి ఏది నిజమో తెలియాలంటే వేచి చూడాల్సిందే.